Janasena: కౌలు రైతుల‌కు రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని

  • 12 నుంచి కౌలు రైతు కుటుంబాల‌కు ప‌వ‌న్ ప‌రామ‌ర్శ‌
  • అనంత‌పురం నుంచే ప‌రామ‌ర్శ యాత్ర ప్రారంభం
  • బాధిత కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం  
pawan kalyan 5 crores donation to farmers welfare

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కాసేప‌టి క్రితం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకునే నిమిత్తం రూ.5 కోట్ల విరాళాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ప్రారంభ‌మైన పార్టీ కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం చేయ‌నున్న‌ట్లుగా ఉగాది రోజున ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న మేర‌కు మంగ‌ళ‌వారం నాడు పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి హాజ‌రైన ప‌వ‌న్ కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.5 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. 

ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాల‌ను స్వ‌యంగా ప‌రామ‌ర్శిస్తాన‌ని తెలిపారు. ఈ ప‌రామ‌ర్శ యాత్ర‌ల‌ను ఈ నెల 12న అనంత‌పురం నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

More Telugu News