Vijayendra Prasad: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad gives clarity on RRR sequel
  • ఘన విజయం సాధించిన 'ఆర్ఆర్ఆర్'
  • సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
  • సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేసిన విజయేంద్రప్రసాద్

దర్శక దిగ్గజం రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అవుతోంది. ఈ సినిమాల విజయాల వెనుక రాజమౌళి కృషి ఎంత ఉందో... ఆయన తండ్రి, సినీ రచయిత విజయేంద్రప్రసాద్ క్రెడిట్ కూడా అంతే ఉంది. అద్భుతమైన కథలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఘన విజయం సాధించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి కూడా ఆయనే కథ అందించారు. మరోవైపు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? అనే ఉత్సుకత సినీ అభిమానులందరిలో ఉంది. 

ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పై విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, దేవుడి దయ ఉంటే సీక్వెల్ రావచ్చని చెప్పారు. తాజాగా నిన్న రాత్రి దిల్ రాజు ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీలో ఈ సినిమా సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కథను సిద్ధం చేయబోతున్నట్టు చెప్పారు. ఈ వార్తతో తారక్, రామ్ చరణ్ అభిమానులు ఇక ఖుషీనే కదా? 

  • Loading...

More Telugu News