ఎలాన్ మ‌స్క్ పెట్టుబ‌డి వెల్ల‌డితో దూసుకెళ్లిన‌ ట్విట్ట‌ర్ షేరు విలువ‌

04-04-2022 Mon 20:34
  • ట్విట్ట‌ర్‌లో ఎలాన్ మ‌స్క్‌కు 9.2 శాతం షేర్లు
  • సంస్థ‌లో అతిపెద్ద షేర్ హోల్డ‌ర్ ఆయ‌నేన‌ట‌
  • 26 శాతం మేర లాభప‌డ్డ ట్విట్ట‌ర్ షేరు
twitter share jumps because of elan musk shares disclose
టెస్లా కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎలాన్ మ‌స్క్ వెల్ల‌డించిన ఒకే ఒక్క అంశంతో ట్విట్ట‌ర్ షేరు విలువ సోమ‌వారం దూసుకెళ్లింది. ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ కంపెనీ అయిన టెస్లాతో మ‌స్క్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా త‌న‌దైన శైలి వ్య‌వ‌హారంతో నిత్యం వార్త‌ల్లో నిలిచే మ‌స్క్‌..సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో ప్ర‌ముఖ‌మైన ట్విట్ట‌ర్‌లో భారీగా పెట్టుబ‌డి పెట్టార‌ట‌. అయితే ఆ విష‌యాన్ని ఆయ‌న ఇప్ప‌టిదాకా వెల్ల‌డించలేదు.

తాజాగా సోమ‌వారం రెగ్యులేట‌రీ సంస్థ‌ల‌కు చేరిన నివేదిక‌ల్లో ట్విట్ట‌ర్‌లో ఎలాన్ మ‌స్క్‌కు ఏకంగా 9.2 శాతం షేర్లు ఉన్నాయ‌ని తేలింది. అంతేకాకుండా ట్విట్ట‌ర్‌లో అతి పెద్ద షేరు హోల్డ‌ర్ కూడా ఎలాన్ మ‌స్కేన‌ని తేలింది. ఈ విష‌యం వెల్ల‌డి కావడంతో మార్కెట్‌లో ట్విట్ట‌ర్ షేరు విలువ అమాంతంగా పెరిగిపోయింద‌ట‌. సోమ‌వారం ఈ షేరు విలువ ఏకంగా 26 శాతం మేర పెరిగిందని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.