V Srinivas Goud: ఏ పబ్ లో డ్రగ్స్ దొరుకుతున్నాయో బండి సంజయ్ చెబితే దాడులు చేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud reacts on police raids at a pub in Hyderabad
  • రాడిసన్ బ్లూ హోటల్లో పోలీసుల దాడులు
  • ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టబోమన్న మంత్రి
  • రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు
  • కేటీఆర్ పై ఆరోపణల్లో నిజంలేదని వ్యాఖ్య  
హైదరాబాదు రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడులు చేయడం పట్ల రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మలచడంలో భాగంగానే రాడిసన్ బ్లూ హోటల్లో పోలీసులు దాడులు చేసినట్టు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

పబ్ లో దొరికినవారికి ఏ పార్టీతో సంబంధాలున్నా వదిలిపెట్టబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఏ పబ్ లో డ్రగ్స్ దొరుకుతున్నాయో బండి సంజయ్ చెబితే దాడులు చేస్తాం అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కనుసన్నల్లో పబ్బులు నడుస్తున్నాయన్న దాంట్లో వాస్తవంలేదని స్పష్టం చేశారు.
V Srinivas Goud
Pub
Drugs
Bandi Sanjay
KTR
Hyderabad
TRS
BJP
Telangana

More Telugu News