Mother: గంజాయికి బానిసైన కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన తల్లి... వీడియో ఇదిగో!

  • గంజాయి మత్తుకు అలవాటుపడిన 15 ఏళ్ల కుర్రాడు
  • అనేక పర్యాయాలు నచ్చజెప్పిన తల్లి
  • తీరు మార్చుకోని కుర్రాడు
  • కళ్లలో కారం చల్లిన తల్లి
Mother beaten drug addicted son in Kodada

డ్రగ్స్ కు బానిసై ఇటీవల ఓ ఇంజినీరింగ్ కుర్రాడు ప్రాణాలు కోల్పోవడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఆపై, హైదరాబాదులో ఓ పబ్ లో డ్రగ్స్ దొరకడం, అనేకమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో, సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన కుమారుడికి తల్లి దేహశుద్ధి చేసిన ఘటన వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది. 

15 ఏళ్ల కుర్రాడు గంజాయి లేనిదే బతకలేని స్థితికి వచ్చాడు. కొడుకు మాదక ద్రవ్యాలకు బానిస కావడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఎన్నోసార్లు చెప్పినా వినకపోవడంతో అపర కాళిక అవతారం ఎత్తింది. కొడుకును ఓ కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం చల్లింది. దాంతో ఆ కుర్రాడు మంట మంట అంటూ గగ్గోలెత్తిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News