Nakka Anand Babu: ఎమ్మెల్యే మేరుగు నాగార్జున చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు: నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu expressed dissatisfaction on new districts formation
  • వేమూరుకు తెనాలితో శతాబ్దాలుగా అనుబంధం ఉంది
  • వేమూరుని తెనాలిలో కలపకుండా బాపట్లలో కలపడం దారుణం
  • మేరుగు నోరు మెదకపోవడం వల్లే ఇలా జరిగింది
కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల అసంతృప్తికి కారణమవుతోంది. జిల్లాల విభజన వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించిందని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. తెనాలితో వేమూరుకు శతాబ్దాలుగా అనుబంధం ఉందని... ఇప్పుడు విడిపోతున్నామని చెప్పారు. వేమూరుని కూతవేటు దూరంలో ఉన్న తెనాలిలో కలపకుండా బాపట్లలో కలపడం దారుణమని అన్నారు. వేమూరు ప్రజలకు ఈరోజు దుర్దినమని చెప్పారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున నోరు మెదపకపోవడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ పాలనా విధ్వంసాలకు జిల్లాల విభజన ఒక తార్కాణంగా నిలుస్తుందని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఎంత బాధ పడ్డామో... ఇప్పుడు జిల్లాల విభజనతో కూడా అంతే బాధపడుతున్నామని అన్నారు. ఈ రెండు చీకటి దినాలుగా మిగిలిపోతాయని చెప్పారు.
Nakka Anand Babu
Telugudesam
Merugu Nagarjuna
YSRCP
Vemuru
Tenali

More Telugu News