AR Rahman: కుమారుడితో క‌లిసి గ్రామీ అవార్డు వేడుక‌ల్లో ఏఆర్ రెహ‌మాన్‌

  • ఆదివారం రాత్రి వేడుక‌గా గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం
  • లాస్ వెగాస్ వేదిక‌గా జ‌రిగిన వేడుక‌కు ఏఆర్ రెహ‌మాన్‌
  • కుమారుడితో క‌లిసి వ‌చ్చిన సంగీత ద‌ర్శ‌కుడు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన తండ్రీకొడుకుల ఫొటో
ar rehman attends grammy award ceremony with his son

భారత సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ గ్రామీ అవార్డుల వేడుకల్లో ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచారు. ఇందుకు కార‌ణం ఆయ‌న త‌న కుమారుడు ఏఆర్ అమీన్‌తో క‌లిసి ఈ వేడుక‌ల‌కు హాజ‌రు కావ‌డ‌మే. లాస్ వెగాస్ వేదిక‌గా ఆదివారం రాత్రి జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ఎప్ప‌టి మాదిరే ప‌లు సినీ ప్ర‌ముఖులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. అందులో భాగంగానే ఈ ద‌ఫా కూడా రెహ‌మాన్ ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. 

అయితే ఎన్న‌డూ లేని రీతిలో ఈ ద‌ఫా వ‌ర్ధ‌మాన గాయ‌కుడిగా ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిల‌దొక్కుకుంటున్న త‌న కుమారుడు అమీన్‌ను తీసుకుని ఆయ‌న ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు.
కుమారుడిని గ్రామీ అవార్డుల వేడుక‌కు తీసుకెళ్లిన రెహ‌మాన్ వేదిక‌పైకి త‌న కుమారుడిని తీసుకుని వెళ్లి మ‌రీ సెల్ఫీ తీసుకున్నారు. 

ఈ ఫొటోను త‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన రెహ‌మాన్.. ఆ ఫొటోకు "గ్రామీస్" అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక తొలిసారిగా ఈ వేడుక‌ల‌కు హాజ‌రైన అమీన్ కూడా త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫొటోకు "పేరెంటింగ్" అన్న ట్యాగ్‌ను జ‌త చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

More Telugu News