Peedika Rajanna Dora: సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే రాజన్న దొర

YCP MLA Peedika Rajanna Dora hospitalized with mild illness
  • ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం
  • వర్చువల్ సమావేశం నిర్వహించిన సీఎం జగన్
  • పార్వతీపురం నుంచి హాజరైన పీడిక రాజన్నదొర
  • అస్వస్థతకు గురై పార్వతీపురం ఆసుపత్రిలో చేరిక
ఏపీ సీఎం జగన్ ఇవాళ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ప్రజాప్రతినిధులు వర్చువల్ విధానంలో హాజరు కాగా, మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర పార్వతీపురం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అయితే సమావేశం జరుగుతుండగా రాజన్నదొర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనను పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు.
Peedika Rajanna Dora
Illness
Parvathipuram
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News