HDFC Bank: హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ విలీనం

  • దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావం
  • మార్కెట్ విలువ సుమారు రూ.13 లక్షల కోట్లు
  • విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానం
HDFC Bank to merge with mortgage lender HDFC Ltd

దేశంలో అతి పెద్ద మార్ట్ గేజ్ రుణాల సంస్థ అయిన హెచ్ డీఎఫ్ సీ.. దీని అనుబంధ కంపెనీ అయిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విలీనంతో ఒకే కంపెనీగా ఆవిర్భవించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా హెచ్ డీఎఫ్ సీ వాటాదారుల వద్దనున్న ప్రతి 25 షేర్లకు 42 హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్లు లభిస్తాయి. 

ఈ విలీనం వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములు అందరికీ విలువను చేకూరుస్తుందని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ప్రకటించింది. అంతేకాదు, రెండు సంస్థలు కలవడం వల్ల వ్యాపారాన్ని పెంచుకోవచ్చని, మరిన్ని ఉత్పత్తులను కస్టమర్లకు అందించడం సాధ్యపడుతుందని పేర్కొంది. 

2021 డిసెంబర్ 31 నాటికి హెచ్ డీఎఫ్ సీ నిర్వహణలో రూ.6,23,420 కోట్ల ఆస్తులు ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నిర్వహణలో రూ.19,38,285 కోట్ల ఆస్తులు ఉన్నాయి. గత శుక్రవారం ముగింపు నాటికి చూస్తే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ విలువ రూ.8.34 లక్షల కోట్లు. హెచ్ డీఎఫ్ సీ మార్కెట్ విలువ రూ.4.44 లక్షల కోట్లు. విలీన కంపెనీ రూ.12.8 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ (రూ.18 లక్షల కోట్లు) తర్వాత రెండో అత్యంత విలువైన సంస్థగా అవతరిస్తుంది.

More Telugu News