Ramcharan: చరణ్ సినిమా కోసం పాటకి 10 కోట్లు .. ఫైట్ కి 10 కోట్లు!

  • 'ఆర్ ఆర్ ఆర్'తో హిట్ కొట్టిన చరణ్ 
  •  త్వరలో మొదలుకానున్న ఆచార్య' ప్రమోషన్స్ 
  • ఇక శంకర్ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి 
  • తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరితో
shankar and Charan movie update

'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న చరణ్, త్వరలో  'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ సినిమా విడుదల తరువాత చరణ్ పూర్తిస్థాయిలో శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడని తెలుస్తోంది. ఇంతవరకూ చిత్రీకరించిన సన్నివేశాలు శంకర్ స్థాయికి తగినట్టుగానే ఉన్నాయట. ఈ సినిమాలో ఒక పాట కోసం దాదాపు ఆయన 10 కోట్ల వరకూ ఖర్చు చేయించినట్టుగా చెబుతున్నారు. ఒక ఫైట్ సీన్ కోసం కూడా 10 కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. 

చరణ్ ఫ్రీ అయ్యాడు కనుక ఇక నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరగనుందని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా అరవిందస్వామి పేరు వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత గౌతమ్  తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

More Telugu News