Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పదో తరగతి సిలబస్ నుంచి ‘అమరావతి’ తొలగింపు

AP Government removed Amaravati syllabus from 10th Exams
  • నేటి నుంచి ‘పది’ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్
  • అమరావతి, వెన్నెల పాఠాలు తప్పించి మిగతావి చదువుకోవాలని సూచన
  • ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి తెలుగు పుస్తకం నుంచి ‘అమరావతి’ సిలబస్‌ను తొలగించింది. ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైందని, కాబట్టి విద్యార్థులపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. దీంతోపాటు వివిధ సబ్జెక్టుల్లోని మరికొన్ని పాఠాలను కూడా తొలగించినట్టు పేర్కొన్నారు.

మరోపక్క, సిలబస్ నుంచి అమరావతి సిలబస్‌ను తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులపై భారం పడకూడదనుకుంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగిస్తారు కానీ రెండో పాఠంగా ఉన్న అమరావతిని ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు తప్ప మిగిలిన పాఠాలు చదువుకుని సిద్ధం కావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు.
Andhra Pradesh
10th Students
Amaravati
Exams

More Telugu News