Malaika Arora: ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మలైకా అరోరా

Malaika Arora gets discharged from hospital
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన మలైకా
  • పూణే నుంచి తిరగి వస్తుండగా ఘటన
  • మలైకాను గుర్తించిన ఎంఎన్ఎస్ పార్టీ నేత
  • నవీ ముంబయిలో ఓ ఆసుపత్రికి తరలింపు

పూణేలో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తిరిగివస్తుండగా, బాలీవుడ్ నటి మలైకా అరోరా రోడ్డు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. మలైకాను ఎంఎన్ఎస్ పార్టీకి చెందిన నేత ఒకరు గుర్తించి నవీ ముంబయిలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, మలైకా అరోరా తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఆమె నుదుటికి గాయాలైనట్టు తెలుస్తోంది.  
గాయాలకు చికిత్స చేసిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో డిశ్చార్జి చేశారు. మలైకా ఆసుపత్రి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
.

  • Loading...

More Telugu News