Nagababu: పబ్ లో నిహారిక.... నాగబాబు ఏమన్నారంటే...!

Nagababu reacts on his daughter Niharika issue
  • పుడింగ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
  • పబ్ లో నిహారిక ఉండడం సంచలనం సృష్టించిన వైనం
  • తప్పుడు ప్రచారం చేయొద్దన్న నాగబాబు
  • తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అని వెల్లడి
బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడులు చేయగా, ఆ పబ్ లో నిహారిక కొణిదెల కూడా ఉందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. దీనిపై నాగబాబు స్పందించారు. పబ్ లో నిహారిక ఉండడం వల్లే తాను మాట్లాడాల్సి వస్తోందని వెల్లడించారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

తన కుమార్తె నిహారిక విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని నాగబాబు వివరించారు. ఇక, ఈ విషయంలో ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.
Nagababu
Niharika
Pub
Hyderabad
Tollywood

More Telugu News