Pakistan: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖానే.. అవిశ్వాసం నిలిపివేత

Pak No Confidence Motion Disallowed by deputy speaker
  • తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్
  • విదేశీ కుట్ర ఉందంటూ ఆరోపణ
  • ఓటింగ్ కు తిరస్కరణ
  • నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనుమతించలేదు. ఇది విదేశాల కుట్ర అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి మాత్రం దానిని తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకోలేదు. ఓటింగ్ పెట్టకుండా తిరస్కరించారు. 

దీంతో అవిశ్వాస తీర్మానం జరిగే వరకు ఇమ్రాన్ ఖానే మళ్లీ ప్రధానిగా కొనసాగనున్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్ తీరుపట్ల ప్రతిపక్షాలు సభలోనే ఆందోళనకు దిగాయి. అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు. వాస్తవానికి స్పీకర్ అసద్ ఖైజర్ పైనా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్, స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. కాగా, అంతకుముందే ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీతో సమావేశమయ్యారు.
Pakistan
Imran Khan
Prime Minister
No Confidence

More Telugu News