Vodafone Idea: 30 రోజులు, 31 రోజులు.. వొడాఫోన్ ఐడియా రెండు కొత్త ప్లాన్లు

Vodafone Idea introduces two new prepaid plans with 30 days and 31 days validity
  • ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఆవిష్కరణ
  • రూ.327 ప్లాన్ లో 30 రోజుల వ్యాలిడిటీ
  • రూ.337తో 31 రోజుల గడువు
  • ప్లాన్ వ్యాలిడిటీ వరకు డేటా ఆఫర్
నెల రోజుల వ్యాలిడిటీతో కనీసం ఒక ప్లాన్ వోచర్ ను అయినా అందించాలంటూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలను వొడాఫోన్ ఐడియా అమల్లో పెట్టింది. 30 రోజులు, 31 రోజుల వ్యాలిడిటీతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. నెలరోజుల ప్లాన్ ను ప్రతి నెలా అదే రోజు రీచార్జ్ చేసుకునే విధంగా ఉండాలన్నది ట్రాయ్ ఆదేశం. 

రూ.327 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. రోజువారీ డేటా పరిమితి కాకుండా, ప్లాన్ కాల వ్యవధిలో మొత్తం 25 జీబీ డేటాను అందిస్తోంది. నిత్యం 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తోంది. అపరిమిత కాల్స్ కు అదనంగా, వీఐ మూవీస్, టీవీ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 

రూ.337 ప్లాన్ 31 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఇందులోనూ రోజువారీ డేటా కాకుండా ప్లాన్ కాల వ్యవధిలో మొత్తం 28 జీబీ ఉచితంగా వాడుకోవచ్చు. రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. వీఐ మూవీస్, టీవీ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందొచ్చు.
Vodafone Idea
new plans
prepaid
monthly validity

More Telugu News