Farming: రైతుకూలీగా మారిపోయిన యంగ్ హీరోయిన్

Sai Pallavi Turns Out To Be Farm Wager
  • పొలంలో పసుపు ఏరిన సాయి పల్లవి
  • మహిళా రైతులతో కలిసి దిగిన ఫొటో పోస్ట్
  • నీలా ఎవ్వరుండరంటూ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్

ప్రేమమ్ తో అందరినీ ఆకట్టుకున్న సాయిపల్లవి.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ యంగ్ స్టార్ హీరోలతో జత కడుతోంది. తాజాగా నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’, నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో సక్సెస్ ను అందుకుంది. 

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆమె రైతుకూలీగా అవతారం ఎత్తింది. ఎక్కడో తెలియదుగానీ.. కూలీగా మారి పొలంలో పసుపును ఏరింది. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘‘వేర్లతో భూమిలోకి బలంగా నాటుకుపోయాయి.. అయినా, పెకిలించి బయటకు తీసేశాం’’ అంటూ ఆమె కామెంట్ చేసింది. 

దానికి చాలా మంది కో స్టార్లు, హీరోయిన్లు, అభిమానులు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చాలా నచ్చిందంటూ అనుపమ పరమేశ్వరన్  ఎమోజీ పెట్టి కామెంట్ చేసింది. ‘‘నీలా ఎవరూ ఉండలేరు’’ అంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ వ్యాఖ్యానించింది. 

 ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • Loading...

More Telugu News