UK: లండ‌న్‌లో పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై దాడికి య‌త్నం

  • షరీఫ్‌ బాడీగార్డుకి తీవ్ర‌ గాయాలు
  • నిందితుడి కోసం గాలింపు
  • నిందితుడు పీటీఐ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌ 
  • నేడు అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న ఇమ్రాన్ ఖాన్‌
pti worker attacks sharif

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ ప్ర‌భుత్వం కుప్ప‌కూలే ప్ర‌మాదం ఉండ‌డంతో ఆ దేశ అధికార పీటీఐ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉంటోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌పై పీటీఐకి చెందిన ఓ కార్యకర్త దాడికి య‌త్నించాడు. ఈ దాడిలో షరీఫ్‌ బాడీగార్డు తీవ్ర‌ గాయాల‌పాల‌య్యాడు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసులు న‌మోదు చేసుకున్న అక్క‌డి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఇమ్రాన్‌ ఖాన్ ప్ర‌భుత్వంపై విపక్షాలు పెట్టిన‌ అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్‌ జరగనుంది. ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం గెలుస్తామ‌ని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని విపక్ష కూటమి ధీమాగా ఉంది.

More Telugu News