goat: మేక‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు.. వీడియో ఇదిగో

  • కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్‌లో ఘ‌ట‌న‌
  • దోష నివారణ కోసం అంటూ పెళ్లి
  • నవ గ్రహ ఆలయంలో వివాహం జ‌రిపించిన అర్చకులు
man marries goat

దోష నివారణ కోసం అంటూ మేకను పెళ్లి చేసుకున్నాడు ఓ యువ‌కుడు. జాత‌కం ప‌ట్ల ఆ యువ‌కుడికి ఉన్న న‌మ్మ‌క‌మే ఇందుకు కార‌ణం. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. తనకు రెండు పెళ్లిళ్లు జ‌రుగుతాయ‌ని జాతకంలో ఉండడంతో దోష నివారణ జరిపించాల‌ని ఆ యువ‌కుడు అనుకున్నాడు. 

ఉగాది సంద‌ర్భంగా నిన్న స్థానికంగా ఉండే నవ గ్రహ ఆలయంలో అర్చకులు ఆ యువ‌కుడికి మేక‌తో మొదటి వివాహం జ‌రిపించారు. మ‌న హిందూ ధర్మంలో దోష నివార‌ణ కోసం ఇలా చేయొచ్చ‌ని ఉంద‌ని వారు చెప్పారు. పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.  

         

More Telugu News