Radisson Blu: బంజారాహిల్స్‌లో పబ్‌పై దాడి.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్!

police attacked on pub Rahul sipligunj and others in police custody
  • ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి
  • సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు గుర్తించిన వైనం
  • పబ్ యజమానితో పాటు 150 మంది అదుపులోకి
  • రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా!

బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి దాడిచేసిన పోలీసులు అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ  కొందరు యువకులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News