Shubhman Gill: అదరగొట్టిన శుభ్ మాన్ గిల్... గుజరాత్ 171-6

Opener Shubhman Gill flamboyant innings guides Gujarat Titans for huge total
  • పూణేలో గుజరాత్ వర్సెస్ ఢిల్లీ
  • మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్
  • 84 పరుగులు చేసిన గిల్
  • రాణించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
  • 3 వికెట్లు తీసిన ముస్తాఫిజూర్
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ అద్భుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. 

మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (1) ఆరంభంలోనే వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తెవాటియా 14 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.
Shubhman Gill
Gujarat Titans
Delhi Capitals
Pune
IPL

More Telugu News