KTR: సిల్లీ బీజేపీ నేతలు... ధాన్యం కొనుగోలు అంశంలో కేటీఆర్ విమర్శనాస్త్రాలు

  • ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై పోరాటం
  • ఐదు అంచెల పోరాటానికి పిలుపు
  • వివిధ స్థాయుల్లో నిరసనలు
  • కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం అంటూ కేటీఆర్ ఆగ్రహం
KTR fires in BJP leaders over paddy procurement

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై పోరాటం కొనసాగుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ బీజేపీ నేతలు ఒకలా మాట్లాడుతుంటే, సిల్లీ బీజేపీ నేతలు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల అనుకూల ప్రభుత్వం కాదని అర్థమైందని అన్నారు. కార్పొరేట్లకు అనుకూల ప్రభుత్వమని ఆరోపించారు. 

ఇటీవల కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్న బండి సంజయ్ ప్రతి గింజను కొనుగోలు చేయించే బాధ్యత మాది అంటూ ప్రగల్భాలు పలికారని కేటీఆర్ విమర్శించారు. 'యాసంగిలో రా రైస్ అయినా, బాయిల్డ్ రైస్ అయినా సరే కేంద్రమే కొనుగోలు చేస్తుందని కిషన్ రెడ్డి చెబుతున్నారు... ఆ లెక్కన రా, బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొంటుందా? కొనదా?... ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నది కరెక్టా..? లేక, ఇక్కడి సిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నది కరెక్టా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. 

ఇక మీదట ధాన్యం అంశంలో కేంద్రంపై ఐదెంచల పోరాటం ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, ఏప్రిల్ 6న విజయవాడ, బెంగళూరు, ముంబయి, నాగపూర్ జాతీయ రహదారులపై రాస్తారోకో చేపడతామని కేటీఆర్ వివరించారు. ఏప్రిల్ 7న హైదరాబాద్ మినహాయించి మిగిలిన 32 జిల్లాల కేంద్రాల్లో నిరసనలు ఉంటాయని, ఏప్రిల్ 8న రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని, ర్యాలీలు చేపట్టి, కేంద్ర సర్కారు దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని వివరించారు. ఏప్రిల్ 11న ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News