Raviteja: పోస్టర్ తోనే అదరగొట్టేస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'

  • 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ 
  • ఓ స్టూవర్టుపురం దొంగ కథ ఇది
  • కథానాయికలుగా నుపుర్ - గాయత్రి 
  • దర్శకుడిగా వంశీకృష్ణ
Tiger Nageshwara Rao Movie uIpdate

రవితేజ ఈ ఏడాది మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటిగా 'రామారావు ఆన్ డ్యూటీ' త్వరలో విడుదల కానుంది. ఆ తరువాత సినిమాలుగా 'ధమాకా' .. ' రావణాసుర' సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలను ఈ ఏడాదిలోనే థియేటర్లకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ రోజునే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాత్రి వేళలో ట్రైన్ వస్తుండగా .. దాని లైటు వెలుగులో 'టైగర్ నాగేశ్వరరావు'గా ధైర్యంగా నడుస్తూ రవితేజ కనిపిస్తున్నాడు. ఫస్టు పోస్టర్ చూస్తుంటేనే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది అర్థమైపోతుంది.

చాలా కాలం క్రితం ఇటు ప్రజలను .. అటు పోలీసులను తిప్పలు పెట్టిన ఓ స్టూవర్టుపురం దొంగ కథ ఇది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో నుపుర్ సనన్ .. గాయత్రి భరద్వాజ్ తెలుగు తెరకి  పరిచయమవుతున్నారు.

More Telugu News