Allu Arjun: ఆ సినిమాతో బన్నీ ఆత్మ పరిశీలన చేసుకున్నాడు: అల్లు బాబీ

Allu Bobby opines on his brother Allu Arjun career
  • బన్నీ కెరీర్ లో నిరాశపర్చిన 'నా పేరు సూర్య' చిత్రం
  • ఆ సినిమా పరాజయం పాలైందన్న బాబీ
  • బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడని వ్యాఖ్య 
  • ఎలాంటి కథలు ఎంచుకోవాలో నిర్ణయించుకున్నట్టు వివరణ
పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ చేరింది. ఈ సినిమాకు ముందు కొన్ని చిత్రాలు అల్లు అర్జున్ ను నిరాశకు గురిచేశాయి. దీనిపై బన్నీ సోదరుడు అల్లు బాబీ స్పందించారు. అల్లు బాబీ నిర్మాతగా తెరకెక్కిన గని ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని బన్నీ సినిమాలు చేస్తుంటాడని తెలిపారు. కెరీర్ ను విజయవంతం చేసుకునేందుకు, ఆడియన్స్ కు సరైన సినిమాలు అందించేందుకు బన్నీ ఎంతో తపన పడుతుంటాడని వివరించారు. 

అయితే 'నా పేరు సూర్య...' చిత్రం కూడా ఎంతో కష్టపడి చేసినా, వ్యతిరేక ఫలితం వచ్చిందని తెలిపారు. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా, ఫ్లాప్ కావడంతో బన్నీ రెండేళ్లు సినిమాలు చేయలేదని అల్లు బాబీ వివరించారు. ఆ సినిమాతో బన్నీ ఆత్మ పరిశీలన చేసుకున్నాడని, ఎలాంటి కథలతో వెళితే బాగుంటుందో నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. ఆ క్రమంలో వచ్చిందే 'అల.. వైకుంఠపురములో' చిత్రం అని తెలిపారు. 
Allu Arjun
Allu Bobby
Naa Peru Surya
Ala Vaikunthapuramulo
Tollywood

More Telugu News