hottest: 1901 తర్వాత దంచి కొట్టే ఎండలు మళ్లీ ఇప్పుడే!

  • ఈ ఏడాది మార్చిలో గరిష్ఠ వేడి
  • సగటు ఉష్ణోగ్రతలు 33.1 డిగ్రీల సెల్సియస్
  • భారత వాతావరణ శాఖ ప్రకటన
March 2022 was Indias hottest in 122 years says weather department

ఈ ఏడాది ఎండలు మార్చి నుంచే ఠారెత్తిస్తున్నాయి. వాస్తవానికి ఈ వేసవి సీజన్ కూల్ గా ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు వేయగా.. అవి బోల్తా కొట్టాయి. ఐఎండీ అంచనాలకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రికార్డులను బద్దలు చేసే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది. 1901 తర్వాత 122 ఏళ్లలో మార్చి నెలలోనే ఇంతటి వేడి వాతావరణం నమోదు కావడం ఇదే మొదటి సారి అని పేర్కొంది. 2022 మార్చి నెలలో సగటు ఉష్ణోగ్రతలు 33.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. 

పొడి వాతావరణం ఎక్కువ రోజుల పాటు ఉండడమే వేడి పెరగడానికి కారణంగా తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి 6 మధ్య తీవ్ర వడగాలుల రిస్క్ ఉంటుందని అంచనా వేసింది. అందుకనే మధ్యాహ్న సమయంలో అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడం గమనార్హం.

More Telugu News