Ugadi: ప్రభుత్వానికి అన్నీ శుభాలే జరుగుతాయి.. ప్ర‌భుత్వ ఆస్థాన సిద్ధాంతి క‌ప్ప‌గంతు జోస్యం

kappagantu panchanga shravan in tadepalli
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్ర‌భుత్వ ఆస్థాన సిద్ధాంతి క‌ప్ప‌గంతు సుబ్బ‌రామ సోమ‌యాజి శ‌నివారం నాడు ఉగాది వేడుక‌ల్లో భాగంగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో పంచాంగ శ్ర‌వ‌ణం వినిపించారు. ఏపీలో మ‌రోమారు వైసీపీనే అధికారం వ‌రిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని ఆయన చెప్పారు.

శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి అన్నీ మంచి శుభాలే జరుగుతాయని కప్పగంతు తెలిపారు. చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలు హాయిగా ఉంటారని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల వల్ల ధరలు పెరిగినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రజలపై భారం పడకుండా చూస్తోంద‌ని సోమయాజి తెలిపారు. అంతేకాకుండా ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని సిద్ధాంతి కప్పగంతు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Ugadi
Kappahantu Subbarama Somayaji
YSRCP

More Telugu News