కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించిన భారత్ బయోటెక్
- ప్రకటించిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్
- టీకాలకు డిమాండ్ తగ్గడం, సరఫరా పూర్తి కావడంతోనే నిర్ణయం
- ఏడాది కాలంగా ఊపిరిసలపకుండా పనిచేశామన్న సంస్థ
కరోనా అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ టీకాను భారీగా ఉత్పత్తి చేయడం, అందుకోసం ఏడాది కాలంగా తమ ఉత్పత్తి కేంద్రాలన్నీ నిరంతరాయంగా పనిచేశాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పుడీ కేంద్రాలన్నింటినీ నవీకరించే ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే అంశంపై దృష్టిసారిస్తామని వివరించింది.