Police: ఇనుప కండలు, ఉక్కు నరాలు... ఈజిప్టు పోలీసుల వైరల్ వీడియో ఇదిగో!

 Egypt police passing out parade video went viral
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో సందడి
  • శిక్షణ పూర్తి చేసుకున్న ఈజిప్టు యువ పోలీసులు
  • పాసింగ్ అవుట్ పెరేడ్ లో విన్యాసాలు
  • బాడీ బిల్డర్లను తలపించిన వైనం
ప్రపంచంలో ఏ దేశంలోని పోలీసులకైనా దేహ దారుఢ్యం ఎంతో అవసరం. అందుకే పోలీసు నియామకాల్లో ఫిజికల్ టెస్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శారీరక దృఢత్వం ఉన్నవారినే పోలీసు శాఖలోకి తీసుకుంటారు. ఇక అసలు విషయానికొస్తే... ఈజిప్టు పోలీసులకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఈజిప్టు పోలీసులు తమ కండలు తిరిగిన దేహాలను ప్రదర్శించడమే కాదు, తమ కండబలం ఎలాంటిదో కూడా చూపించారు. 

వారందరూ ఈజిప్టులోని ఓ పోలీస్ ట్రైనింగ్ కాలేజిలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో వారు వంటిపై చొక్కాల్లేకుండా కేవలం ప్యాంట్ తో దర్శనమిచ్చారు. బాడీబిల్డర్లను తలపించే దేహాకృతితో వారు చేసిన విన్యాసాలు అచ్చెరువొందించేలా ఉన్నాయి. ఈజిప్టు పోలీసుల ప్రదర్శన పట్ల నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
Police
Body Building
Egypt
Viral Video

More Telugu News