Raviteja: రవితేజ సరసన రెండో నాయిక ఈ బ్యూటీనే!

  • 'టైగర్' నాగేశ్వరరావు'గా రవితేజ
  • ఒక కథానాయికగా నుపుర్ సనన్ 
  • మరో కథానాయికగా గాయత్రి భరద్వాజ్
  • రేపు జరగనున్న పూజా కార్యక్రమాలు  
Tiger Nageshwara Rao Movie uIpdate

రవితేజ కథానాయకుడిగా ' టైగర్ నాగేశ్వరరావు' సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను రేపు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.                                                                                      
                                                                                               
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు వుంటారు. ఒక కథానాయికగా నుపుర్ సనన్ ను ఎంపిక చేసిన టీమ్, తాజాగా గాయత్రి భరద్వాజ్ ను కూడా తీసుకున్నట్టుగా ప్రకటిస్తూ ఆమె ఫొటోను వదిలారు. ఈ ఢిల్లీ బ్యూటీ అందాల పోటీల్లో పలుమార్లు విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది. 

ఇటీవల రవితేజ వరుసగా ఇద్దరు హీరోయిన్ల కథలతో సందడి చేస్తున్నాడు. 'ఖిలాడి'లో మీనాక్షి చౌదరి - డింపుల్ హయతితో ఆడిపాడిన ఆయన, 'రామారావు ఆన్ డ్యూటీ'లో దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ తో కలిసి పలకరించనున్నాడు. ఇక 'టైగర్ నాగేశ్వరరావు'తోను ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు.

  • Loading...

More Telugu News