India: ర‌ష్యా మంత్రితో ముగిసిన జైశంక‌ర్ చ‌ర్చ‌లు.. ఏమేం చ‌ర్చించారంటే..!

india and russia forgiegn ministers discussions concluded
  • సుదీర్ఘంగా సాగిన లావ్‌రోవ్‌, జైశంక‌ర్ చ‌ర్చ‌లు
  • ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌పైనే కీల‌క చ‌ర్చ‌
  • ఉక్రెయిన్‌, ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితుల‌పైనా చ‌ర్చ‌లు

భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్‌రోవ్ శుక్ర‌వారం ఢిల్లీలో భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన వీరి భేటీ కాసేప‌టి క్రితం ముగిసింది. ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రితో త‌న చ‌ర్చ‌లు ముగిశాయ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్న జైశంక‌ర్.. చ‌ర్చ‌ల్లో ఏఏ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని కూడా వివ‌రించారు.

భార‌త్‌, ర‌ష్యా ద్వైపాక్షిక సంబంధాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ‌లు సాగిన‌ట్లు జైశంక‌ర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ర‌ష్యా యుద్ధం సాగిస్తున్న ఉక్రెయిన్‌లోని తాజా ప‌రిస్థితులు, తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘ‌నిస్థాన్ లోని ప‌రిస్థితుల‌పైనా చ‌ర్చ‌లు సాగించిన‌ట్లు వెల్ల‌డించారు. అంతేకాకుండా ఇరాన్‌, ఇండో ఫ‌సిఫిక్‌, ఏసియాన్ దేశాలు, భార‌త ఉప‌ఖండంలోని తాజా ప‌రిస్థితుల‌పైనా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు జైశంక‌ర్ చెప్పారు.

  • Loading...

More Telugu News