Suresh Kondeti: హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన జర్నలిస్టుపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు: క‌రాటే కల్యాణి

karate kalyani comments on suresh kendeti deragatory words on heroine
  • వివాదంగా హీరోయిన్‌పై సురేశ్ కొండేటి వ్యాఖ్య‌లు
  • చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విష్ణు హామీ ఇచ్చార‌న్న‌క‌ల్యాణి
  • ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కానివ్వ‌మ‌ని భ‌రోసా
టాలీవుడ్‌లో ఇటీవ‌లే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న డీజే టిల్లు సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన నేహా శెట్టిపై ప్ర‌ముఖ సినీ జ‌ర్న‌లిస్టు, నిర్మాత‌ సురేశ్ కొండేటి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విషయంపై పెద్ద చ‌ర్చే న‌డిచింది. తాజాగా ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) జాయింట్ సెక్ర‌ట‌రీ హోదాలో క‌రాటే కల్యాణి శుక్ర‌వారం స్పందించారు.

డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టిపై సురేశ్ కొండేటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌ని క‌రాటే క‌ల్యాణి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని ఆమె చెప్పారు. ఈ వివాదంపై క‌మిటీలో చ‌ర్చించి చ‌ర్యలు తీసుకుంటామ‌ని మా అధ్య‌క్షుడు విష్ణు హామీ ఇచ్చార‌ని కూడా ఆమె తెలిపారు. హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సురేశ్ కొండేటిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆమె వ్యాఖ్యానించారు.
Suresh Kondeti
DJ Tillu
Neha Shetty
MAA
Karate Kalyani

More Telugu News