Pavan Kalyan: 'వీరమల్లు'ను పూర్తిచేసే వరకూ సెట్టు దిగని పవన్!

  • షూటింగు దశలో 'వీరమల్లు'
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్    
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. మొగల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన భారీ సెట్లను రెడీ చేశారు. చాలాకాలం క్రితమే 50 శాతం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, అప్పటి నుంచి పరిస్థితులు కలిసి రాకపోవడం వలన ఆలస్యమవుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేయాలనే పట్టుదలతో పవన్ రంగంలోకి దిగుతున్నాడు. ఇకపై ఈ ప్రాజెక్టు లేట్ కాకూడదనే ఉద్దేశంతో ఏకధాటిగా పవన్ 5 నెలల సమయాన్ని కేటాయించినట్టుగా చెబుతున్నారు. ఆగస్టు నాటికి ఈ సినిమాను పూర్తిచేసి, ఆ వెంటనే మిగతా పనులు స్టార్ట్ చేస్తారట.

ఏప్రిల్  6వ తేదీ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. చారిత్రక నేపథ్యంలో తొలిసారిగా పవన్ చేస్తున్న ఈ సినిమాను, దసరాకి రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News