Andhra Pradesh: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కారు అనుమతి

ap government issues green signal to fillup 292 posts
  • మొత్తం 292 ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి
  • గ్రూప్ 1లో 110 పోస్టులు
  • గ్రూప్ 2 కింద 182 పోస్టులు
  • నోటిఫికేష‌న్లు జారీ చేయ‌నున్న ఏపీపీఎస్సీ

ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు గురువారం నాడు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా గ్రూప్ 1, 2ల కింద మొత్తం 292 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది.

ప్ర‌భుత్వం అనుమతి మంజూరు చేసిన ఉద్యోగాలు మొత్తం 292 కాగా.. వీటిలో గ్రూప్ 1 కింద 110 ఉద్యోగాలు, గ్రూప్ 2 కింద 182 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించిన నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ ఏ క్షణంలోనైనా గ్రూప్ 1,2 నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నుంది.

  • Loading...

More Telugu News