Vishwak Sen: 'అశోకవనంలో' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అశోకవనంలో అర్జున కల్యాణం'
  • విష్వక్ సేన్ జోడీగా రుక్షర్ దిల్లోన్ 
  • సంగీత దర్శకుడిగా జై క్రిష్
  • ఏప్రిల్ 22వ తేదీన విడుదల  
Ashokavanamalo arjuna Kalyanam Lyrical Song Released

విష్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విష్వక్ సేన్ జోడీగా రుక్షర్ ధిల్లోన్ అలరించనుంది. బాపినీడు -  సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి, జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 
  
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "గట్టూదాటి పుట్టా దాటి ఏడేడు ఏర్లు దాటి  .. సీమాసింతా నీడకొచ్చానే .. రంగు రంగు రాం సిలకా" అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ కుమార్ - రవికిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట జానపద బాణీలో సాగుతోంది. 

 ఈ పాటకి యష్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సాంగ్ ఇది. ఇంతవరకూ మాస్ కి కనెక్ట్ అయ్యే  కథలను చేస్తూవు వచ్చిన విష్వక్ సేన్, ఈ సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

More Telugu News