Gaalivaana: జీ5లో వస్తున్న రాధిక, సాయికుమార్ 'గాలివాన'.... నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

Gaalivaana web series trailer out now
  • జీ5లో మరో వెబ్ సిరీస్
  • ఏప్రిల్ 14 నుంచి 'గాలివాన' స్ట్రీమింగ్
  • శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'గాలివాన'
  • తాజాగా ట్రైలర్ విడుదల
ఓటీటీల పుణ్యమా అని వెబ్ సిరీస్ లు జోరుగా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఒకటో రెండో ఓటీటీలు ఉండగా, ఇప్పుడు పదుల సంఖ్యలో ఓటీటీలు ప్రేక్షకులకు కొత్త కంటెంట్ అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయి. తాజాగా, రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధానపాత్రధారులుగా నిర్మితమైన వెబ్ సిరీస్ గాలివాన. ఇది జీ5 ఓటీటీలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

తాజాగా ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున చేతులు మీదుగా గురువారం సాయంత్రం 5 గంటలకు అధికారికంగా విడుదలైంది. 1:39 నిమిషాల నిడివి కలిగిన ఆ ట్రైలర్‌ వీక్షకులను నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తోంది. ట్రైలర్‌లోని కంటెంట్‌ను గమనిస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌తో పాటు, హై ఎమోషన్‌తో చెప్పిన ఓ డైలాగ్‌ సిరీస్‌ లో ప్రతీకారం అనే పాయింట్‌ కూడా ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పింది. 

క్వాలిటీ పరంగా, విజువల్స్‌ పరంగా భారీతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గతంలో కొన్ని క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇందులో మాత్రం మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన క్రైం థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా క్యారీ చేసేలా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. సాయికుమార్‌ పాత్ర కూడా ఎమోషన్‌తో పాటు ఫ్యామిలీ బాండిరగ్‌కు ఉన్న విలువను చూపిస్తోంది.

గాలివాన వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్ తో పాటు చాందినీ చౌదరి, చైతన్యకృష్ణ, అశ్రిత వేముగంటి, నందిని రాయ్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ బ్యానర్లపై సమీర్ గోగాటే, శరత్ మరార్ నిర్మించారు.
Gaalivaana
Web Series
ZEE5
Radhika Sarat Kumar
Sai Kumar
Trailer
Sharan Koppisetty

More Telugu News