Prabhas: 'మిర్చి'ని మించిన కథ .. ప్రభాస్ ను ఒప్పించిన కొరటాల!

Prabhas in Koratala Movie
  • 'మిర్చి'తో ప్రభాస్ కి హిట్ ఇచ్చిన కొరటాల
  •  ప్రభాస్ తో మరో సినిమా చేసే ఛాన్స్
  • అవసరమైతే కొరటాల ప్రాజెక్టు ముందుకు 
  • ప్రస్తుతం కొరటాల చేతిలో ఎన్టీఆర్ మూవీ
కొరటాల కెరియర్ ను గమనిస్తే ఒకసారి హిట్ అందుకున్న హీరోలతో ఆయన మరో సినిమాను ప్లాన్ చేస్తూ రావడం కనిపిస్తుంది. మహేశ్ బాబుతో 'శ్రీమంతుడు' చేసిన ఆయన ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆయనతో 'భరత్ అనే నేను' సినిమాను తెరకెక్కించి మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. 

ఇక కొంతకాలం క్రితం ఎన్టీఆర్ తో ' జనతా గ్యారేజ్'  చేసిన ఆయన, ఇప్పుడు ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ప్రభాస్ తో ఓ సినిమాను రూపొందించనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్లో 2013లో వచ్చిన 'మిర్చి' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకి వెళ్లడానికి ముందే కొరటాల - ప్రభాస్ మధ్య కథాచర్చలు జరిగాయని అంటున్నారు. 'సలార్' .. 'ప్రాజెక్టు K' తరువాత ప్రభాస్ ముందుకు కొన్ని ప్రాజెక్టులు వెళ్లాయి. వాటిలో ముందుగా కొరటాలకి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయంతో ప్రభాస్ ఉన్నాడని చెబుతున్నారు.  
Prabhas
Koratala Siva
Tollywood

More Telugu News