Bonda Uma: సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు: బొండా ఉమ

  • పేదలపై మోయలేని అప్పుల భారాన్ని మోపుతున్నారు
  • జగన్ అసమర్థత వల్ల విద్యుత్ వ్యవస్థ గాడి తప్పింది
  • ట్రూఅప్ పేరుతో బాదుడుకి జగన్ సిద్ధమయ్యారు
Jagan increasing electricity charges to stop welfare schemes says Bonda Uma

ఏపీలోని పేద ప్రజలపై గత మూడేళ్లుగా సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం కదా అని వారిపై మోయలేని అప్పుల భారాన్ని మోపుతున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలను పెంచి, ధనవంతులపై మాత్రం భారాన్ని తగ్గిస్తున్నారని బొండా ఉమ విమర్శించారు. 

జగన్ ది ముమ్మాటికీ తుగ్లక్ పాలనే అని అన్నారు. సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకే విద్యుత్ చార్జీలను పెంచుతున్నారని దుయ్యబట్టారు. జగన్ అవినీతి, అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. ట్రూఅప్ పేరుతో బాదుడుకు జగన్ సిద్ధమయ్యారని చెప్పారు. గనులు, ఇసుక, మద్యం తదితరాలపై వచ్చే కమీషన్లపై పెట్టిన దృష్టిని పేదలపై పెట్టలేదని విమర్శించారు.

More Telugu News