Vanniyar Community: వన్నియార్ కులస్తులకు రిజర్వేషన్లు చెల్లవు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • వన్నియర్లకు ఎంబీసీలో 10.5 శాతం రిజర్వేషన్లను కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం
  • రిజర్వేషన్లు చెల్లవంటూ గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు
  • మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
Vanniyar community reservation quota cancelled by Supreme Court

విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వన్నియర్ కులానికి 10.5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ రిజర్వేషన్లు చెల్లవంటూ ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. వన్నియర్ క్షత్రియులను అత్యంత వెనుకబడిన కులాలలోని (ఎంబీసీ) 115 కులాల నుంచి వేరు చేయడం సరికాదని బెంచ్ తెలిపింది.      

వన్నియర్ కులానికి స్టాలిన్ ప్రభుత్వం 10.5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ 2021లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఎంబీసీ కోసం 20 శాతం కోటా ఉండగా... అందులో 10.5 శాతాన్ని వన్నియర్ కులానికి వర్తింపజేస్తూ తమిళనాడు యాక్ట్ 2021ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవంటూ తీర్పును వెలువరించింది.

More Telugu News