Pavan kalyan: ఏప్రిల్ 6 నుంచి సెట్స్ పైకి పవన్ కల్యాణ్!

  • 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్ 
  • 'పంచమి' పాత్రలో నిధి అగర్వాల్
  • క్రిష్ దర్శకత్వం.. కీరవాణి సంగీతం  
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథతో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. మొగల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. ఆ కాలానికి సంబంధించిన సెట్స్ వేయటడానికి ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని రంగంలోకి దింపారు. ఆయన రూపకల్పనలో సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

కరోనా కారణంగా .. 'భీమ్లా నాయక్' సినిమాతో పవన్ బిజీ గా ఉండటం వలన, ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పటికి 50 శాతం మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూ వచ్చింది.  ఏప్రిల్ 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి టీమ్ వచ్చినట్టుగా సమాచారం. 

 ఇప్పటికే చాలా ఆలస్యం కావడం వలన, సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాలో ఒక గజదొంగ పాత్రలో పవన్ కనిపించనుండగా, 'పంచమి' అనే పాత్రలో నిధి అగర్వాల్ అలరించనుంది. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News