crypto tax: ఏప్రిల్ 1 నుంచి క్రిప్టోలపై పన్ను సహా పలు వాటిలో మార్పులు

  • డిజిటల్ అసెట్స్ లాభాలపై 30 శాతం పన్ను
  • ఆధార్-పాన్ లింకింగ్ తప్పనిసరి
  • పెరగనున్న థర్డ్ పార్టీ మోటారు బీమా ప్రీమియం
several changes that kick in from April 1

క్రిప్టోలపై పన్ను సహా ఎన్నో మార్పులు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆధార్ తో పాన్ ను లింక్ చేసుకునే గడువు 2022 మార్చి 31తో ముగిసిపోతోంది. ఏప్రిల్ 1 నుంచి లింక్ చేసుకునే వారు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 2022 జూన్ 30 వరకే. ఆ తర్వాత అనుసంధానించుకుంటే జరిమానా రూ.1,000 కట్టాలి. 2022 మార్చి 31 వరకు అనుసంధానించుకోకపోతే.. 2023 ఏప్రిల్ 1 నుంచి పాన్ పనిచేయదు. దాంతో ఆర్థిక లావాదేవీలకు అవకాశం ఉండదు.

ఇప్పటి వరకు క్రిప్టో లావాదేవీల్లో వచ్చే లాభాలపై పన్ను లేదు. కానీ, ఏప్రిల్ 1 నుంచి వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీలపై వచ్చే లాభం నుంచి 30 శాతం పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ అసెట్స్ ను వేరొకరికి బదలాయించినా ఇదే పన్ను రేటు అమలవుతుంది. 

ఆర్బీఐ, సెబీ నియంత్రణలోని సంస్థల వద్ద ఖాతాలు కలిగిన వారు తమ కేవైసీ వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా, గుర్తింపు వివరాలను వాటి జిరాక్స్ కాపీలు ఇవ్వడం ద్వారా ధ్రువీకరించాలి. మార్చి 31 నాటికే ఇది పూర్తి కావాలి. 

థర్డ్ పార్టీ మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రియం కానుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు థర్డ్ పార్టీ కవరేజీ కోసం అధికంగా చెల్లించుకోక తప్పదు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ కవరేజీ తక్కువకే వస్తుంది. 

పోస్టాఫీసు డిపాజిట్లను పోస్టల్ సేవింగ్స్ ఖాతా లేదా ఏదైనా ఇతర బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోవాలి. దీంతో వడ్డీ ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.

More Telugu News