Madhya Pradesh: అరుదైన బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. రెండు తలల మధ్య నుంచి మూడో చేయి!

Baby born with two heads and three hands in MPs Ratlam
  • మధ్యప్రదేశ్‌లోని రాట్లాం జిల్లాలో ఘటన
  • సోనోగ్రఫీలో కవలు ఉన్నట్టు గుర్తింపు
  • ఆపరేషన్ చేశాక మాత్రం ఒకే శరీరం
  • ఇండోర్ ఎంవై ఆసుపత్రికి తరలింపు
  • శిశువు పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళ అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. రాట్లాం జిల్లాలోని జావ్రా గ్రామానికి చెందిన షహీన్ నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో వెంటనే ఆమెను రాట్లాంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ చేసిన వైద్యులు శిశువును చూసి ఆశ్చర్యపోయారు. బిడ్డకు రెండు తలలు, మూడు చేతులు ఉండడంతో నిర్ఘాంతపోయారు. 

మహిళకు అంతకుముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో గర్భంలో కవలలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆపరేషన్ చేశాక మాత్రం ఒకే శరీరానికి రెండు తలలు, మూడు చేతులు ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తలల మధ్య వెనక నుంచి మూడో చేయి ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

బిడ్డను వెంటనే నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)కు తరలించారు. అక్కడ కొంత సమయం ఉంచి తర్వాత ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. బిడ్డ ఇలా జన్మించడాన్ని వైద్య పరిభాషలో ‘పాలీసెఫాలీ కండిషన్’ అంటారని చెప్పారు. 

ప్రస్తుతం శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఎస్ఎన్‌సీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ నవీద్ ఖురేషీ తెలిపారు. ఇలాంటి కేసుల్లో శిశువు గర్భంలోనే మరణిస్తుందని, లేదంటే పుట్టిన 48 గంటల్లోనైనా ప్రాణాలు కోల్పోతుందన్నారు. సర్జరీ చేసే అవకాశం ఉన్నా 60-70 శాతం మంది చిన్నారులు బతకడం లేదని డాక్టర్ నవీద్ వివరించారు.
Madhya Pradesh
Ratlam
Baby

More Telugu News