Telangana: తెలంగాణలో పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్ గ‌డువు పొడిగింపు

  • 15 రోజుల పాటు గ‌డువు పొడిగింపు
  • ఏప్రిల్ 15 దాకా కొన‌సాగ‌నున్న స్పెష‌ల్ డ్రైవ్‌
  • వాహ‌న‌దారుల వెసులుబాటు కోస‌మేన‌న్న పోలీసు శాఖ‌
telangana police department extends pending challans clearence

తెలంగాణ పోలీసు శాఖ బుధ‌వారం రాత్రి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్‌ను మ‌రో 15 రోజుల‌కు పొడిగించింది. భారీ రాయితీతో పెండింగ్ ‌చలాన్లను క్లియ‌ర్ చేసుకోవాలంటూ గ‌త నెల‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన పోలీసు శాఖ.. ఈ నెల 1 నుంచి 31 వ‌ర‌కు స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్ర‌క‌టించింది. పోలీసు శాఖ ఊహించిన‌ట్టుగానే వాహ‌న‌దారుల నుంచి ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు మంచి స్పంద‌నే ల‌భించింది. బుధ‌వారం నాటికి ఏకంగా రూ.250 కోట్ల మేర పోలీసు శాఖ‌కు ఆదాయం స‌మ‌కూరింది.

అయితే మ‌రో రోజులోనే పెండింగ్ ‌చలాన్ల క్లియ‌రెన్స్ పథకం ముగియ‌నుండ‌గా.. ఇంకా చాలా మంది వాహ‌న‌దారులు త‌మ ‌చలాన్ల‌ను క్లియ‌ర్ చేసుకోలేదు. క్లియ‌రెన్స్ గ‌డువు పొడిగింపు ఉండ‌ద‌ని మంగ‌ళ‌వారం నాడు ప్ర‌క‌టించిన పోలీసు శాఖ‌.. బుధ‌వారం నాటికే త‌న విధానాన్ని మార్చుకుంది. వాహ‌న‌దారుల‌కు మ‌రింత వెసులుబాటు క‌ల్పించేలా పెండింగ్ ‌చలాన్ల క్లియ‌రెన్స్‌ను మ‌రో 15 రోజుల పాటు పొడిగిస్తున్న‌ట్లు బుధ‌వారం రాత్రి ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ‌చలాన్ల క్లియ‌రెన్స్ ఏప్రిల్ 15 దాకా కొన‌సాగుతుంది.

More Telugu News