Ukraine: భార‌త ప‌ర్య‌ట‌న‌కు ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి

russian Foreign Minister Sergey Lavrov tour india for two days
  • రెండు రోజుల పాటు భార‌త్ లో ప‌ర్య‌టించ‌నున్న లావ్‌రోవ్‌
  • ముందుగా చైనాకు వెళ్లి అక్క‌డి నుంచి భార‌త్‌కు
  • అధికారికంగా ప్ర‌క‌టించిన భార‌త విదేశాంగ శాఖ‌
ఉక్రెయిన్‌తో కొన‌సాగిస్తున్న యుద్ధం ముగిసే దిశ‌గా అడుగులు వేస్తున్న స‌మ‌యంలో ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్‌రోవ్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. గురువారం మొద‌లు కానున్న‌ లావ్‌రోవ్ ప‌ర్య‌ట‌న శుక్ర‌వారం కూడా కొన‌సాగ‌నున్న‌ట్లు భార‌త విదేశీ మంత్రిత్వ శాఖ బుధ‌వారం నాడు అధికారికంగా ప్ర‌క‌టించింది.

భార‌త్ పర్య‌ట‌న‌కు వచ్చే ముందు లావ్‌రోవ్ తొలుత చైనాకు వెళ్ల‌నున్నారు. చైనా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు ముగిశాక ఆయన భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేప‌థ్యంలో చాలా కాలం పాటు బ‌య‌ట‌కే క‌నిపించ‌ని లావ్‌రోవ్.. యుద్ధం ముగిసే దిశ‌గా ర‌ష్యా అడుగులు వేస్తున్న క్ర‌మంలో చైనా, భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
Ukraine
Russia
Sergey Lavrov
China
India

More Telugu News