Kangana Ranaut: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన కంగనా రనౌత్

Kangana Ranaut praises Rajamouli
  • గ్రేటెస్ట్ డైరెక్టర్ అని రాజమౌళి మరోసారి నిరూపించారు
  • ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే
  • దేశంపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. తాను గ్రేటెస్ట్ డైరెక్టర్ అనే విషయాన్ని రాజమౌళి మరోసారి నిరూపించారని ప్రశంసించింది.

 ఇప్పటి వరకు ఆయన తీసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదని తెలిపింది. ఆయన ప్రతి సినిమా సూపర్ హిట్ అయిందని ప్రశంసించింది. రాజమౌళి విజయాల కంటే ఆయన వినయం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలని చెప్పింది. దేశంపై, దేశం నమ్ముకున్న ధర్మంపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పదని తెలిపింది. 'మీలాంటి రోల్ మోడల్ ఉండటం మా అదృష్టం సార్' అని వ్యాఖ్యానించింది. నేను మీ అభిమానిని అని తెలిపింది.

  • Loading...

More Telugu News