Pakistan: ఇమ్రాన్‌తో పాక్ ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్‌ల భేటీ

imran khan meeting with pak army and isi chiefs
  • ప్ర‌ధాని అధికార నివాసంలో భేటీ
  • సుదీర్ఘంగా కొన‌సాగుతున్న స‌మావేశం
  • భేటీ త‌ర్వాత దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ఇమ్రాన్ ప్ర‌సంగం
పొరుగు దేశం పాకిస్థాన్‌లో రాజ‌కీయంగా కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పాక్ ప్ర‌ధానిపై విప‌క్షం ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గే దిశ‌గా వేగంగా ప‌రిణామాలు మారిపోయాయి. ఇమ్రాన్ సొంత పార్టీ నేత‌లు కూడా విప‌క్షానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ క్ర‌మంలో పాక్ ప్ర‌ధాని ప‌ద‌వికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ప్ర‌ధాని హోదాలో ఇమ్రాన్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌, ఆ దేశ గూఢ‌చార సంస్థ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఇస్లామాబాద్‌లోని ఇమ్రాన్ అధికారిక నివాసంలో మొద‌లైన ఈ భేటీ ఇంకా కొన‌సాగుతోంది. ఈ భేటీ ముగియ‌గానే ఇమ్రాన్ పాక్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.
Pakistan
Imran Khan
ISI
Pakistan Army Chief

More Telugu News