Asias Best 50: ఆసియా 50 బెస్ట్ రెస్టారెంట్లలో మన దేశం నుంచి మూడు

3 Indian restaurants feature in Asias Best 50 list
  • ముంబైలోని మాస్క్ రెస్టారెంట్ కు 21వ స్థానం
  • ఢిల్లీలోని మరో రెండు రెస్టారెంట్లకూ చోటు
  • జాబితాను విడుదల చేసిన విలియమ్ రీడ్
ఈ ఏడాదికి ఆసియాలోని 50 మంచి రెస్టారెంట్లలో భారత్ నుంచి మూడింటికి చోటు లభించింది. ఈ జాబితాను విలియమ్ రీడ్ బిజినెస్ మీడియా విడుదల చేసింది. టోక్యోలోని డెన్ రెస్టారెంట్ ఇందులో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. 

ఈ జాబితాలోని రెస్టారెంట్లను.. చెఫ్ లు, రెస్టారెంట్ యజమానులు, విమర్శకులు, ఆహారంపై రచనలు చేసేవారు, ఆహార నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మన దేశం నుంచి ముంబైలోని ‘మాస్క్’ 21వ స్థానంలో ఉంది. ఢిల్లీలోని ‘ఇండియన్ యాక్సెంట్’ 22వ స్థానాన్ని, ఢిల్లీలోని ‘మెగు’ రెస్టారెంట్ 49వ స్థానాన్ని దక్కించుకున్నాయి.  

ముంబైలోని మాస్క్ రెస్టారెంట్ ను చెఫ్ ప్రతీక్ సాధు, డైరెక్టర్ అదితి దుగార్ స్థాపించారు. రుచికరమైన పదార్థాలకే ఇక్కడ చోటు ఉంటుంది. అలాగే, రుతువుల వారీగా, స్థానికంగా లభించే ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుంది. 2020 జాబితాలోనూ మాస్క్ చోటు దక్కించుకోవడం గమనార్హం.
Asias Best 50
restaurants
India

More Telugu News