sleep: కంటి నిండా నిద్ర లేకపోతే వచ్చే అనర్థాలు ఎన్నో..!

  • ప్రమాదాలకు ఆస్కారం
  • రోగ నిరోధక వ్యవస్థ బలహీనం
  • బరువు పెరిగే రిస్క్
  • హార్మోన్లలో అసమతుల్యతలు
  • గుండె జబ్బుల ప్రమాదం కూడా ఎక్కువే
things that may happen to you when you dont get enough sleep

సరిపడా నిద్ర మంచి ఆరోగ్య సూత్రాల్లో ఒకటి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలం నిద్రలోనే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిద్ర తక్కువ అయితే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. 


వాహన ప్రమాదాలు
నిద్ర సరిపడా లేకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో లోపం ఏర్పడుతుంది. ఇది వాహనం నడిపే తీరునూ మార్చేస్తుంది. దాంతో ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. 

సంతానోత్పత్తి సామర్థ్యం
తగినంత నిద్ర లేకపోతే హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. గ్రోత్ హార్మోన్ అయిన టెస్టో స్టెరోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒత్తిడి హార్మోన్లు నోరెపినెఫ్రిన్, కార్టిసోల్ ను శరీరం విడుదల చేయడానికి కారణం కావచ్చు. ఇది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. 

అనారోగ్యం
సరైన నిద్ర పోకపోవడం వల్ల శరీరంలో ఒత్తిళ్లు, వాపునకు అవకాశం ఉంటుుంది. ఇది వ్యక్తి రోగనిరోధకతను తగ్గిస్తుంది. దాంతో తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. 

బరువు పెరగడం
నిద్ర తగ్గితే బరువు పెరిగేందుకు దారి తీయవచ్చు. ఆకలి తెలియజేసే హార్మోన్ల పనితీరుపై ప్రభావం ఉంటుంది. ఇన్సులిన్ విడుదల కూడా దెబ్బతింటుంది. దీంతో కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగేందుకు కారణమవుతుంది. దీంతో టైప్-2 మధుమేహం రిస్క్ కూడా పెరుగుతుంది.

గుండె జబ్బులు
సరిపడా నిద్ర లేకపోతే రక్తపోటు నియంత్రణ తప్పుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు, వాపు పెరుగుతాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి.

కారణాలు/పరిష్కారం
రాత్రి, పగలు షిప్ట్ ల్లో పనిచేసే వారు, తీవ్రమైన శబ్ద కాలుష్యంలో పని చేసేవారు, ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండే చోట, డిప్రెషన్, స్లీప్ ఆప్నియా, తీవ్రమైన నొప్పి ఉన్న వారికి నిద్ర సరిగా పట్టకపోవచ్చు. కనుక నిద్రలేమితో బాధపడేవారు వైద్యులను సంప్రదించాలి. కౌన్సిలింగ్ తో వారు సమస్యను గుర్తిస్తారు. జీవనశైలి పరంగా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.  

More Telugu News