Kane Williamson: ఆ జట్టును నిలువరించడం కష్టం.. కేన్ విలియమ్సన్

We have to execute our plans better says Kane Williamson after big defeat in opener
  • మేము ఎన్నో అంశాల్లో మెరుగుపడాలి
  • ఓటమిపై విశ్లేషణ అవసరం
  • అమలు చేయాల్సిన ప్రణాళికపై స్పష్టత అవసరం
  • సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్రకటన
రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. తాము ఎన్నో అంశాల్లో మెరుగుపడాల్సి ఉందన్నాడు. 

‘‘మేము బాల్ తో ఆటను చక్కగానే ఆరంభించాము. మేము చూసిన అన్ని మ్యాచ్ లలోనూ స్వింగ్ ఆధిపత్యం కొనసాగుతోంది. అందులోనూ కొత్త బాల్ నుంచి సహకారం అందుతోంది. కానీ, పరిస్థితి అలా లేదు. చక్కని పిచ్ వారికి అనుకూలించింది. ఆ జట్టును నిలువరించడం కష్టమైంది. ఓటమిని తార్కికంగా విశ్లేషించుకోవాల్సి ఉంది. మేము ఎన్నో అంశాల్లో మెరుగుపడాలి. 

తదుపరి గేమ్ కు కొన్ని రోజుల వ్యవధి ఉంది. టీ20 సంస్కృతి గురించి మాకు తెలుసు. మొదటి ఇన్నింగ్స్ లో ఒత్తిడి నెలకొంది. రెండో భాగంలో యువ జట్టుగా అమలు చేయాల్సిన ప్రణాళికల విషయంలో స్పష్టత ఉండాలి. మేం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అని విలియమ్సన్ తెలిపాడు. 
 
మంగళవారం హైదరాబాద్ సన్ రైజర్స్ పై రాజస్థాన్ రాయల్స్ 61 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించడం తెలిసిందే. పవర్ ప్లేలో అత్యంత కనిష్ఠ స్కోరు రికార్డును సన్ రైజర్స్ మూటగట్టుకుంది.
Kane Williamson
Sunrisers Hyderabad
srh
RR

More Telugu News