MGNREGA: తెలుగు రాష్ట్రాల్లో ‘ఉపాధి’ కూలి రేట్ల సవరణ.. రూ.12 పెంపు

  • ప్రస్తుతం రూ. 245గా ఉన్న ఉపాధి కూలి
  • రూ. 12 పెంచి, రూ. 257 చేసిన కేంద్రం
  • సిక్కింలో దేశంలోనే అత్యధికంగా రూ. 333 చెల్లింపు
MGNREGA Daily wage charges hiked Rs 12 in Ap and Telangana

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా) కూలి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రోజుకు రూ. 245 ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం దీనికి మరో రూ. 12 పెంచి రూ. 257 చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది.

2018-19లో ఉపాధి పథకం రోజువారి కూలి రూ. 205గా ఉండేది. ఇప్పుడు రూ.257కు చేరింది. అంటే ఈ ఐదేళ్లలో 25.36 శాతం పెరిగింది. ఇక ఈ పథకం కింద సిక్కింలోని మూడు పంచాయతీల పరిధిలో దేశంలోనే అత్యధికంగా రూ. 333 చెల్లిస్తుండగా, మధ్యప్రదేశ్‌లో అతి తక్కువగా రూ. 204 ఇస్తున్నారు. అలాగే, కేరళలో రూ. 311, కర్ణాటకలో రూ. 309, తమిళనాడు, పుదుచ్చేరిలో రూ. 281 చొప్పున రోజువారి ఉపాధి కూలి చెల్లిస్తున్నారు.

More Telugu News