RR: సన్ రైజర్స్ ముందు కొండంత లక్ష్యం... ఏం చేస్తారో!

  • పూణేలో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు
  • చితకబాదిన రాజస్థాన్ బ్యాట్స్ మెన్
  • భారీగా పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్
Rajasthan Royals set huge target to SRH

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో పోరులో సన్ రైజర్స్ బౌలర్లు తేలిపోయారు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ సన్ రైజర్స్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. ప్రతి ఒక్కరు పోటీలు పడి సిక్సులు, ఫోర్లు బాదారు. దాని ఫలితంగా.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఓపెనర్ జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు, కెప్టెన్ సంజూ శాంసన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు, దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు, హెట్మెయర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశారు. 

మొదట్లోనే భువనేశ్వర్ బౌలింగ్ లో జోస్ బట్లర్ అవుట్ కాగా, అది నోబాల్ కావడంతో సన్ రైజర్స్ కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత కూడా సన్ రైజర్స్ బౌలర్లు అనేక నోబాల్స్ వేశారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2, నటరాజన్ 2, భువనేశ్వర్ 1, రొమారియో షెపర్డ్ 1 వికెట్ తీశారు.

More Telugu News