TDP: టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. తెనాలిలో తీవ్ర ఉద్రిక్తత‌

clash between tdp and ysrcp in tenali
  • శివాజీచౌక్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుక‌లు
  • త‌మ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించాయ‌ని వైసీపీ ఆరోప‌ణ‌
  • ప్ర‌తిగా టీడీపీ ఫ్లెక్సీల‌ను చించేసిన వైసీపీ శ్రేణులు
టీడీపీ 40 వసంతాల వేడుక‌ల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌ట్ట‌ణంలోని శివాజీ చౌక్‌లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మ‌ధ్య చిన్న‌గా మొద‌లైన వివాదం ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్న గ‌లాటాతో ప‌ట్ట‌ణంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే... టీడీపీ 40 వసంతాల వేడుక‌ల్లో భాగంగా తెనాలిలో ఆ పార్టీ శ్రేణులు శివాజీ చౌక్‌లో సంబరాలు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ నేత‌లు చించేసిన‌ట్టుగా వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా వైసీపీ శ్రేణులు టీడీపీ ఫ్లెక్సీల‌ను చించేశాయి. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది.
TDP
YSRCP
Tenali
Guntur District
TDP Formation Day

More Telugu News